Nani as Bloody Romeo : బ్లడీ రోమియో అంటూ నాని హల్చల్.

నేచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ను మార్చుకునే భాగంగా అన్నీ సీరియస్ మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ద ప్యారడైజ్ మూవీతో సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీకే బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో పాటు ఈ మూవీ కాన్సెప్ట్ లాంటి వీడియో కూడా విడుదల చేశారు. ఇదంతా నాని బర్త్ డే స్పెషల్ గా చేసిందే. అయితే టైటిల్ తో పాటు వీడియో మాత్రం బాగా ఆకట్టుకుంది. అతనో చెఫ్ పాత్రలో నటించబోతున్నాడు. దీంతో పాటు గ్యాంగ్ స్టర్ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ అండ్ చెఫ్ కు సరిగ్గా సెట్ అయ్యేలాంటి యానిమేషన్ వీడియో చేశారు. దీనికి వెన్నెల కిశోర్ వాయిస్ ఓవర్ యాడ్ చేశారు. ఇదంతా బాగా ఆకట్టుకునేలానే ప్లాన్ చేశారు.
ఎలా జరిగింది.. షూటింగా.. అంటూ ఎవరో ప్రశ్నించారు. కాదు కుకుంగ్ అంటూ వెన్నెల కిశోర్ వాయిస్ వస్తుంది. కుకింగా.. ఏంటా రెసిపీ అంటూ అదే వ్యక్తి వాయిస్.. దానికి వెన్నెల కిశోర్.. చిటికెడు కరుణ.. పిడికెడు కోపం.. బారెడు భీబత్సం.. సరిపోయేంత.. ఛ ఛ.. సారీ.. మతి పోయేంత ప్రేమ.. అంటూ వినిపిస్తుంది. ఆ కుకింగ్ తో పాటు చివర్లో ఓ పెద్ద బాంబ్ కూడా బ్లాస్ట్ చేస్తాడు. అయితే ఇలాంటి వంటా మిగలదు.. మనిషీ మిగలడు అని వేరే వాయిస్.. కానీ ఒక్కడు మిగిలాడు అంటూ వెన్నెల కిశోర్ డైలాగ్. మొత్తంగా ఇదంతా ఇంట్రెస్టింగ్ ప్లాన్ చేశారు. ఈ సమ్మర్ లోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరి హీరోయిన్లూ అంటూ ఇతర పేర్లేం వినిపించలేదు. బట్ తృప్తి దిమ్రి నటించబోతోందని వార్తలు మాత్రం వస్తున్నాయి. ఆమెతో పాటు మాధురీ దీక్షిత్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతోందంటున్నారు. ఇవన్నీ ఇప్పటికి రూమర్సే. బట్ ఈ వీడియో కాన్సెప్ట్ మాత్రం చాలా బావుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
