కార్తీ సీక్రెట్ దాచిన నాని

నేచులర్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘హిట్ 3’. హిట్ మూవీస్ ఫ్రాంఛైజీలో వస్తోన్న థర్డ్ కేస్ ఇది. నానియే నిర్మాత. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్టర్. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తన కెరీర్ లోనే కాదు తెలుగులోనే మోస్ట్ వయొలెంట్ మూవీ అవుతుందని చెబుతున్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో నాని ఈ మూవీ గురించి భారీ భారీ హైప్ లు ఇస్తున్నాడు. ఇందులో అతను అర్జున్ సర్కార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. మామూలుగా హిట్, హిట్ 2 చూస్తే ఆ రెండూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. బట్ ఇది అంతకు మించి ఉంటుందనే చెబుతున్నారు. ఇప్పటి వరకూ దర్శకుడు పెద్దగా మాట్లాడ్డం లేదు కానీ.. నాని మాత్రం ఓ రేంజ్ హైప్ ఇస్తున్నాడీ చిత్రానికి.
ఇక లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రంలో తమిళ్ స్టార్ హీరో కార్తీ కూడా నటించాడట. సినిమాలో బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వడానికే ఇప్పటి వరకూ అతను ఈసినిమాలో ఉన్న విషయాన్ని చెప్పలేదు అంటున్నారు. అయితే ఈ మాట నాని చెప్పలేదు. కానీ కొన్ని విషయాలు దాగవు కదా. కార్తీ అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఖైదీతో అతను మాస్ ను ఎంత ఊపేశాడో అందరికీ తెలుసు. అయితే ఖైదీ పాత్రగా ఇందులో ఎంట్రీ ఇస్తాడని మరో అడుగు ముందుకేసి రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ ఖైదీగా కాదు. కానీ అతను ఓ గెస్ట్ రోల్ చేశాడని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని నాని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నాడో కానీ.. న్యూస్ బయటకు వచ్చిన దగ్గరనుంచి కార్తీ పాత్ర ఏమై ఉంటుందా అనే ఆరాలు మొదలయ్యాయి.
ఇక ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com