Nani: రానా గురించి నానీ.. గొప్ప పనులు ఆయన లాంటి వాళ్ళే చేస్తారు

Nani: దగ్గుబాటి రానా, వెంకటేష్ నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రధానంగా తెలుగు ప్రేక్షకుల విమర్శలను అందుకుంది. అయినప్పటికీ షో అత్యధికంగా వీక్షించిన జాబితాల షోలలో ఒకటిగా నిలిచింది. కారణం ఇందులో అశ్లీల కంటెంట్, హింస అధికంగా ఉన్నాయి. నానీ 'రానా నాయుడు' గురించి మాట్లాడలేదు కానీ, దానిపై వస్తున్న విమర్శల గురించి అడిగినప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు.
'రానా డేరింగ్. అతను విషయాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక స్నేహితుడిగా, అతని ఆలోచన విధానం నాకు తెలుసు. అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు.. అని రానా ఆలోచిస్తున్నాడు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు, ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఒక్కోసారి అవి మిస్ ఫైర్ కూడా అవ్వొచ్చు. కానీ గొప్ప పనులు కూడా ఆయనలాంటి వాళ్ళే చేస్తారు. ఏదో ఒక రోజు అతను మార్గదర్శకుడు అవుతాడు.
తన '90 ml' గురించి అడిగినప్పుడు, విమర్శలకు భయపడి, తాను కోరుకున్నది చేయకపోతే, మరొకరు దానిని చేసి అందరి ప్రశంసలు పొందినప్పుడు పశ్చాత్తాపపడ వలసి వస్తుందని నానీ చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com