Ram Charan : రామ్ చరణ్ తో పోటీకి సై అన్న నాని

నేచురల్ స్టార్ నాని కొన్నాళ్లుగా అగ్రెసివ్ అవుతున్నాడు. కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు కుండ బద్ధలు కొట్టినట్టు సమాధానం చెబుతున్నారు. గతంలో అతనిలా ఉండేవాడు కాదు. తన సినిమా గురించి మాత్రమే మాట్లాడేవాడు. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి, రివ్యూస్ గురించి, కంటెంట్స్ గురించే కాదు.. కాంబినేషన్స్, టైర్ లూ ఇలా చాలానే మాట్లాడుతున్నాడు. ఆ మధ్య కోర్ట్ మూవీ ప్రమోషన్స్ లో తనను టైర్ 2 హీరో అంటే ఒప్పుకోలేదు. అసలు టైర్ లే లేవు అన్నాడు. తాజాగా హిట్3 ప్రమోషన్స్ లోనూ అదే దూకుడు. ఆడియన్స్ థియేటర్స్ రావడం లేదు అంటే నమ్మను అన్నాడు. కంటెంట్ లేకపోతేనే వాళ్లు రారు. అంచేత మారాల్సింది మనం అనేశాడు. ఇదే సమయంలో వచ్చే యేడాది రామ్ చరణ్ తో నాని ది ప్యారడైజ్ మూవీ పోటీ కాబోతోంది. ఇదే విషయం ప్రస్తావిస్తే.. కూడా స్ట్రెయిట్ గా ఓ మాట చెప్పేశాడు.
శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయబోతోన్న ది ప్యారడైజ్ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. తర్వాత అదే డేట్ కు రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ని కూడా అదే డేట్ కు రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. నాని టైర్స్ లేవు అన్నాడు కానీ.. సినిమా భాషలో అతను టైర్ 2 హీరో.. రామ్ చరణ్ టైర్ 1 హీరో. అయినా రామ్ చరణ్ తో తలపడేందుకు ఇబ్బందే లేదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు నాని. కాకపోతే దాన్ని మరో మీనింగ్ లో అన్నాడు.
‘అదేం ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతం రెండూ షూటింగ్ లో ఉన్నాయి. ఆ టైమ్ కు పూర్తవుతాయా లేదా అనేది తెలియదు. పైగా ప్యారడైజ్ కు నేను ప్రొడ్యూసర్ కాదు. అది నిర్మాతలు డిసైడ్ చేస్తారు. అయినా రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే సమస్య లేదు. సంక్రాంతి టైమ్ లో నాలుగైదు సినిమాలు ఒకేసారి వచ్చి బావుంటే ఆడతాయి కదా.. ఇదీ అంతే. పైగా సమ్మర్ ముందు రెండు బ్లాక్ బస్టర్స్ పడితే అంతకంటే కావాల్సిందేముందీ..’ అంటూ పెద్దితో పోటీ ఉన్నా ప్రాబ్లమ్ లేదు అనేలా చెప్పాడు. సో.. తన కంటెంట్ పై నమ్మకంతోనే నాని ఇలా చెప్పాడు అనుకోవచ్చు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com