Nani Paradise : ప్యారడైజ్ రిలీజ్ డేట్ గుర్తు చేసిన నాని

Nani Paradise :  ప్యారడైజ్ రిలీజ్ డేట్ గుర్తు చేసిన నాని
X

నేచురల్ స్టార్ నాని రేంజ్ మార్చుకునే పనిలోనూ వేగమే చూపిస్తున్నాడు.గతంలో అత్యంత వేగంగా సినిమాలు చేసిన నాని మాస్ మూవీస్ టైమ్ లోనూ అదే పంథాలో వెళుతున్నాడు. అతను నటించిన హిట్ 3 మే 1న విడుదల కాబోతోంది. మరోవైపు తను నిర్మించిన కోర్ట్ మూవీ ఏకంగా 45 కోట్ల వరకూ వసూలు చేసి 50 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది. కేవలం 11 కోట్లతో నిర్మించిన సినిమా ఇది. ఈ రేంజ్ విజయం అంటే అతని వాల్ పోస్టర్ బ్యానర్ కు తిరుగులేని లాభాలు తెచ్చింది.

ఇక దసరా తర్వాత అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో రూపొందిస్తోన్న సినిమా ప్యారడైజ్. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ కు దేశం మొత్తం షాక్ అయింది. ఆ రేంజ్ లో ఉన్నాయి డైలాగ్స్. మేకింగ్ పరంగానూ ఓ కొత్త లోకాన్ని చూడబోతున్నాం అనేలా ఉంది. అన్నిటికి మించి అనిరుధ్ నేపథ్య సంగీతం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సోనాలిక కులకర్ణి ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. ఇక ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. అంటే సరిగ్గా యేడాది తర్వాత ఇదే రోజు అన్నమాట. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

Tags

Next Story