సినిమా

Nani: ఆ తమిళ హీరోతో నటించాలని ఉంది: నాని

Nani: పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ కోసం ప్రతీ భాషా ప్రేక్షకులను పలకరిస్తోంది మూవీ టీమ్

Nani (tv5news.in)
X

Nani (tv5news.in)

Nani: నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడిప్పుడే తాను ఎంచుకునే సినిమా కథలకు లిమిట్స్ పెట్టుకోకుండా వేర్వేరు జోనర్లతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా, పక్కింటి కుర్రాడిగా ఎన్నో కమర్షియల్, ఫీల్ గుడ్ సినిమాలతో ఆకట్టుకున్న నాని.. 'శ్యామ్ సింగరాయ్'తో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ సందరర్భంగా తాను ఏ హీరోతో కలిసి నటించాలి అనుకుంటున్నాడో చెప్పేశాడు నాని.

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో చేసిన మల్టీ స్టారర్స్ తక్కువే. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ సెన్సేషన్ క్రియేట్ చేయకముందే తనతో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత 'దేవదాస్' సినిమాలో మరోసారి సీనియర్ హీరో నాగార్జునతో కలిసి నటించాడు. సరైన కథ దొరికితే నాని.. మల్టీ స్టారర్ చేయడానికి కూడా వెనకాడడు. అయితే ఇటీవల తాను ఓ తమిళ హీరోతో మల్టీ స్టారర్ చేయాలంటూ అనౌన్స్ చేశాడు నాని.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ కోసం ప్రతీ భాషా ప్రేక్షకులను పలకరిస్తోంది మూవీ టీమ్. అయితే తాజాగా చెన్నై ఈ సినిమా తమిళ వర్షన్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఆ సందర్భంగా తాను ఎవరైనా తమిళ హీరోతో నటించాలి అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా నాని.. తాను శివకార్తికేయన్‌తో కలిసి నటించాలి అనుకుంటున్నాను అంటూ తన మనసులోని మాటను బయట పెట్టేశాడు.


'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించాడు శివకార్తికేయన్. ఆ తరువాత తాను నటించిన తమిళ సినిమాలన్నీ వరుసగా తెలుగులో కూడా విడుదలవ్వడం మొదలయ్యింది. ఇటీవల విడుదలయిన 'వరుణ్ డాక్టర్' సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా ఫేమ్ అనుదీప్‌తో కలిసి తెలుగులో నేరుగా నటించడానికి సిద్ధమవుతున్నాడు శివకార్తికేయన్. మరి నాని, శివకార్తికేయన్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES