Nani: అన్ని సినిమాలకు పాన్ ఇండియా అని అటాచ్ చేయడం వల్ల లాభం లేదు: నాని

Nani: టాలీవుడ్‌లోనే అత్యంత స్పీడ్‌గా సినిమాలు చేసే హీరో ఎవరు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు నాని. ఈ హీరో ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేస్తూ సెన్సేషన్‌ను క్రియేట్ చేశాడు. వరుస ఫ్లాపుల వల్ల కాస్త స్లో అయినా.. మళ్లీ వెంటనే ఫార్మ్‌లోకి వచ్చాడు. ఇక తాజాగా తన అప్‌కమింగ్ మూవీ 'అంటే సుందరానికి' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న చిత్రమే 'అంటే సుందరానికీ'. 'రాజా రాణి' అనే తమిళ డబ్బింగ్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది నజ్రియా. ఇక తను నటిస్తున్న మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో అంటే సుందరానికీకి తనొక స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది మూవీ టీమ్.
అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరి మీరు ఎప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తారు అని నానిని అడిగారు కొందరు. దానికి నాని సమాధానం వైరల్‌గా మారింది. అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో తనకు తెలియదు అన్నాడు నాని. మన సినిమాకు దేశమంతా మంచి పేరు వస్తే, ఎక్కడెక్కడి నుంచో మన సినిమాను చూసి చాలా బాగుందని ఫోన్ చేసినా సరే అది పాన్ ఇండియా సినిమానే అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తన అప్‌కమింగ్ సినిమా 'దసరా' కూడా అన్ని భాషల్లో విడుదలవుతుందని, కానీ ఇండియాలోని ప్రతీ ప్లేస్‌లో రిలీజ్ అయితేనే అది పాన్ ఇండియా సినిమా అన్నట్టు తాను ఫీల్ అవుతానని తెలిపాడు నాని. అందుకే అన్ని సినిమాలకు పాన్ ఇండియా అని అటాచ్ చేయడం వల్ల లాభం లేదు అన్నాడు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా అదేదో తెలుగు సినిమా బాగుందంటరా అని విని, దాన్ని ఎక్కడో ఒకచోట వెతుక్కుని, ఓటిటిలో అయినా సరే చూసే సినిమాలు చేద్దామంటూ పిలుపునిచ్చాడు నాని. అవే పాన్ ఇండియా సినిమాలు అంటూ చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com