సినిమా

Nani: ఆ హీరో రిజెక్ట్ చేసిన పాన్ ఇండియా కథతో నాని..

Nani: నేచురల్ స్టార్ నాని.. కెరీర్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా పైకొచ్చిన హీరోగా తనకు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు.

nani (tv5news.in)
X

nani (tv5news.in)

Nani: నేచురల్ స్టార్ నాని.. కెరీర్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా పైకొచ్చిన హీరోగా తనకు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. నాని సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. అవి కమర్షియల్‌గా ఆడకపోయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈజీగా కనెక్ట్ అయిపోయేలా ఉంటాయి. అందుకే నానిని ఓ స్టార్ హీరోలాగ కాకుండా పక్కింటి అబ్బాయిలాగా చూస్తారు అభిమానులు. అయితే నాని అప్‌కమింగ్ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

ఒక హీరో కోసం రాసుకున్న కథ ఆ హీరోకు నచ్చకపోతే.. కష్టమైన సరే.. ఆ కథకు సూట్ అయ్యే మరో హీరోను వెతుక్కుంటాడు దర్శకుడు. ఇప్పటికీ ఎన్నోసార్లు వేరే యంగ్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలను ఎంచుకుని సూపర్ హిట్లను కొట్టాడు నాని. తాజాగా అలా ఒక హీరో రిజెక్ట్ చేస్తేనే శ్యామ్ సింగరాయ్ కథ నాని చేతికి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

నాని ఇప్పటివరకు కేవలం తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. తెలుగు, తమిళంలో కూడా ఒకేసారి తెరకెక్కించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలవుతున్న నాని మొదటి సినిమా 'శ్యామ్ సింగరాయ్', టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా దర్శకుడు, కృతి శెట్టి, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ముందుగా శ్యామ్ సింగరాయ్ కథను రానాకు వినిపించాడట దర్శకుడు రాహుల్. ఎందుకో తెలీదు కానీ ఆ కథ రానాకు అంత కనెక్ట్ అవ్వలేదట. అలా ఈ సినిమా నాని చేతికి వచ్చింది. ఇక శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన రైజ్ ఆఫ్ శ్యామ్ పాట కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES