Natural Nani : కోర్ట్ పై నాని నమ్మకం నిజం అవుతుందా

Natural Nani  :   కోర్ట్ పై నాని నమ్మకం నిజం అవుతుందా
X

నేచురల్ స్టార్ నాని తన బాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'కోర్ట్'. దేశంలో అత్యంత శక్తివంతమైన చట్టాల్లో పోక్సో చట్టం ఒకటి. ఈ చట్టం నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది అని ట్రైలర్ చూస్తే తెలిసింది. ఈ 14న కోర్ట్ విడుదల కాబోతోంది. చాలా సున్నితమైన అంశం కావడంతో ఈ పాయింట్ ను ఎలా డీల్ చేసి ఉంటారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ ఉంది. కీలక పాత్రల్లో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. మామూలుగా తన అభిరుచికి తగ్గ సినిమాలే నిర్మిస్తున్నాడు నాని. అందులో కొన్ని కమర్షియల్ 'హిట్'మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఇది కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా. కమర్షియల్ గా ఏ మేరకు వర్కవుట్ అవుతుంది అని అంత ఈజీగా చెప్పలేం. ఈ మూవీతో రామ్ జగదీష్ ను దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు నాని.

కోర్ట్ పై నానికి చాలా నమ్మకం ఉంది. అందుకే రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేస్తున్నాడు. హైదరాబాద్ లో నాలుగు థియేటర్స్ లో ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తే అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇది నాని ఎంచుకునే కథలపై జనాలకు ఉన్న నమ్మకం అని కూడా చెప్పొచ్చు. ఈ నాలుగూ ఫుల్ కావడంతో ఏపిలోనూ మరికొన్ని థియేటర్స్ లో ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. మామూలుగా ప్రీమియర్ అంట ఒక రోజు ముందే వేస్తారు. నాని రెండు రోజుల ముందే ప్రదర్శించబోతున్నాడు. సినిమా బావుంటే కచ్చితంగా ప్రమోషనల్ గా మౌత్ టాక్ తో ముందుకు వెళుతుంది. అందుకు ఈ రెండు రోజులూ కీలకం అవుతాయి. ఓపెనింగ్స్ పెరుగుతాయి. మరి కోర్ట్ పై నాని నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story