Nani: మరోసారి విలన్‌గా నాని.. 'వి' పాత్రను తలపించేలా..

Nani (tv5news.in)
Nani: నేచురల్ స్టార్ నాని అంటేనే తన యాక్టింగ్‌తో ఎవరినైనా మరిపించగలడు. అలాంటి నాని తన నటనకు, కథల సెలక్షన్‌కు ఎప్పుడు లిమిట్స్ పెట్టుకోలేదు. పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా చేయడానికి సిద్ధమయిపోతాడు. కొన్నాళ్ల వరకు రొటీన్ ఎంటర్‌టైనర్‌లు చేసిన నాని.. తాజాగా రూటు మార్చాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఇక మరోసారి నాని విలన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.
ఇంద్రగంటి మెహనకృష్ణ.. నానిని హీరోగా మార్చిన దర్శకుడు. అందుకే ఆ దర్శకుడు అడగగానే తన సినిమాలో విలన్‌గా నటించడానికి కూడా వెనకాడలేదు నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'వి' సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించగా.. నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయినా కూడా ప్రేక్షకుల దగ్గర నుండి ఎక్కువగా పాజిటివ్ రివ్యూలను సాధించలేకపోయింది.
మరోసారి 'వి'లో లాగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించనున్నాడట. 'శ్యామ్ సింగరాయ్' హిట్ తర్వాత 'అంటే సుందరానికి' అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు నాని. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్‌తో 'దసరా' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటిస్తుంది. ఇందులో నానిది కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ సర్కి్ల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com