తెలంగాణ యాసలో తగ్గేదేలే అంటున్న నాని..

తెలంగాణ యాసలో తగ్గేదేలే అంటున్న నాని..
నేచురల్ స్టార్ నాని మొదట నుండి కథల విషయంలో కానీ, నటనా పరంగా కానీ వైవిధ్యంగా ఆలోచించడం మనం చూస్తూనే ఉన్నాం.

నేచురల్ స్టార్ నాని మొదట నుండి కథల విషయంలో కానీ, నటనా పరంగా కానీ వైవిధ్యంగా ఆలోచించడం, దానికి తగినట్టుగా సినిమాలు తెరకెక్కించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మధ్యలో తాను ఎంచుకున్న కథలు మరీ రొటీన్ అయిపోవడంతో నాని సినిమాలు కొన్ని బెడిసికొట్టాయి కూడా. అందుకే జెర్సీ సినిమాలో మధ్య వయస్కుడిగా ఒక క్రికెటర్ రోల్ లో కనిపించిన ఈ నేచురల్ స్టార్ గట్టి కమ్ బ్యాక్ నే ఇచ్చాడు.

అప్పటినుండి ప్రయోగాలపై మరింత దృష్టిని సారించాడు. ఒకవైపు ప్రయోగాత్మక కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చకచక తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు. యంగ్ హీరోలలోనే కాదు.. సీనియర్ హీరోలలో కూడా ఇప్పటివరకు నాని స్పీడ్ ను ఎవరూ అందుకోలేకపోయారు. ఇప్పటికే రెండు సినిమాలను పట్టాలెక్కించిన నాని.. ఇటీవల మరో చిత్రాన్ని ఓకే చేసినట్టు టాక్ మొదలయ్యింది.

పైగా ఇందులో నాని తెలంగాణ యాసలో ప్రేక్షకులను పలకరించనున్నాడట. శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి దసరా అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తే ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. ఇటీవల శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన టక్ జగదీష్ పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా నేరుగా ఓటీటీలో విడుదలయ్యి ప్రేక్షకులను పలకరించింది.

మొదట్లో టక్ జగదీష్ కు నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఓటీటీలో మొదటి రోజే అత్యధిక వ్యూస్ ను సంపాదించిన చిత్రంగా టక్ జగదీష్ రికార్డును సొంతం చేసుకుంది. మరి మరోసారి దసరా లాంటి ఫ్యామిలీ డ్రామాతో నాని ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలడని తెలుసుకోవాలంటే మరింత సమయం వేచిచూడాల్సిందే..

Tags

Read MoreRead Less
Next Story