Nani: నాని కెరీర్‌లో మొదటిసారి.. సినిమా విడుదలవ్వకముందే రికార్డ్..

Nani: నేచురల్ స్టార్ నాని సినిమాలు చేయడంలో ఎప్పుడూ స్లో అవ్వడు. అంతే కాకుండా తను చేసే చాలావరకు సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా కూడా నిలుస్తుంటాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో, లవ్ స్టోరీలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాని లిస్ట్‌లో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఇది 'అంటే సుందరానికీ' సినిమాకే సాధ్యమయ్యింది.
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న చిత్రమే 'అంటే సుందరానికీ'. ఈ సినిమా జూన్ 10న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా మూవీ టీమ్ మాత్రం అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. కొన్ని రోజుల క్రితం సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన మూవీ టీమ్.. ఇటీవల టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.
నాని ఇతర సినిమాలలాగాగే అంటే సుందరానికీ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లాగా అనిపిస్తోంది. సినిమాలోని కామెడీ ఎలిమెంట్స్ అన్నీ టీజర్‌లోనే క్లియర్‌గా చూపించేశాడు దర్శకుడు. అయితే ఈ టీజర్ నాని కెరీర్‌లోనే కొత్త రికార్డ్‌ను సృష్టిస్తోంది. కేవలం 24 గంటల్లోనే అంటే సుందరానికీ టీజర్‌కు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక సినిమాకు దక్కుతున్న పాపులారిటీ చూస్తుంటే నాని మరోసారి హిట్ కొట్టడం ఖాయమే అనుకుంటున్నారు అభిమానులు.
Natural🌟 @NameisNani's Rollercoaster entertainer #AnteSundaraniki Teaser records impressive stats on YouTube 🔥 🔥
— Ante Sundaraniki Movie (@AnteSundaraniki) April 21, 2022
1️⃣1️⃣MILLION+ Views &
313K+ Likes in just 24 Hours 💥 💥
Highest among Young Hero film Teasers in Tollywood 😎💪 pic.twitter.com/kBU81ecbD9
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com