Nani : హీరో నాని .. నాయుడి గారి తాలుకా!

Nani : హీరో నాని .. నాయుడి గారి తాలుకా!
X

ద‌స‌రా, హాయ్ నాన్న‌, స‌రిపోదా శ‌నివారం సినిమాల‌తో వ‌రుస సూప‌ర్ హిట్లు అందుకున్నాడు హీరో నాని. ప్ర‌స్తుతం స‌రిపోదా శ‌నివారం సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని త‌న త‌ర్వాతి సినిమాను అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ‘దసరా’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ను అందించిన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెలాతో మళ్లీ చేతులు క‌లిపాడు. విజ‌య‌ద‌శ‌మిని పురస్కరించుకుని ఈ చిత్రం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమా ద‌స‌రా సినిమాను మించే స్థాయిలో ఉంటుంద‌ని క‌థ క‌థానాల్లో ఉహించ‌ని ట్విస్ట్‌లు ఉంటాయ‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు "నాయుడి గారి తాలుకా" అనే టైటిల్ అనుకుంటున్న‌ట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ‘దసరా’ నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా శ్ర‌ద్ద క‌పూర్, జాన్వీ క‌పూర్ పేర్లు వినిపిస్తున్నాయి.

Tags

Next Story