Nani vs Vijay : నాని వర్సెస్ విజయ్ .. ఈ వార్ వెనక ఉన్నదెవరు..?

Nani vs Vijay :  నాని వర్సెస్ విజయ్ .. ఈ వార్ వెనక ఉన్నదెవరు..?
X

కొన్నాళ్లుగా నాని మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చినా.. విజయ్ దేవరకొండ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో అదో హాట్ టాపిక్ అయిపోతుంది. అయితే ఎవరి సినిమాకు వారి హాట్ టాపిక్ అయితే ఫర్వాలేదు. కానీ ఈ ఇద్దరు హీరోల కంటెంట్స్ ను కంపేర్ చేస్తూ కంపు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ఓ కుట్ర జరుగుతుందా అనే రీతిలో అతనికి వ్యతిరేకంగా పోస్ట్ లు కనిపిస్తుంటాయి. అటు నాని విషయంలోనూ అదే కనిపిస్తుంది. నిజానికి ఈ ఇద్దరు టైర్ టూ హీరోలుగా ఉన్నారు. బట్ విజయ్ తో పోలిస్తే నాని ఇండస్ట్రీకి చాలాకాలం క్రితమే వచ్చాడు. అతనికంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మార్కెట్ ఉంది. ఓవర్శీస్ లోనూ స్ట్రాంగ్ బిజినెస్ ఉంటుంది. అలాంటి నానితో విజయ్ ని కంపేర్ చేస్తూ విజయ్ ని కించపరుస్తూ పోస్ట్ లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

వీటి వెనక ఉన్నది ఎవరో కానీ.. ఆ మధ్య విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ టీజర్ వస్తే చాలా వరకూ బావుందన్నారు. కొందరు మాత్రం పనికట్టుకుని నెగెటివ్ చేశారు. రీసెంట్ గా నాని హిట్ 3 టీజర్ ను కింగ్ డమ్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. తాజాగా నాని ద పారడైజ్ గ్లింప్స్ వస్తే ఈ విషయంలోనూ అదే కనిపిస్తోంది. కానీ తరచి చూస్తే ఇదంతా ఫ్యాన్ వార్ లానే కనిపిస్తున్నా.. బ్యాక్ గ్రౌండ్ లో ఇంకేదో జరుగుతుందని సాధారణ ప్రేక్షకులకు కూడా ఇట్టే అర్థం అయిపోతుంది.

వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వాళ్లు తమ రేంజ్ ను మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నాని ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయిపోడు. ఇప్పుడు చేస్తోన్న మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొడితే వారి రేంజ్ లు మారతాయి. ఇద్దరూ ఆ ఫోకస్ లో ఉన్నారు. కాకపోతే నాని ..విజయ్ కంటే చాలా ముందున్నాడు. అతను ముందే పరిశ్రమకు వచ్చాడు కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. కథల ఎంపికలో విజయ్ కొంత తడబడుతున్నాడు. బట్ కింగ్ డమ్ తో గాడిలో పడతాడు అంటున్నారు. ఏదేమైనా ఇద్దరూ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లే. ఇద్దరూ ప్రతిభావంతులే. ఎవరికి వాళ్లు ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టైమ్ లో వారిని మానసికంగా ఇబ్బంది పెట్టేలా ఫ్యాన్ వార్స్ పేరుతో అసహ్యకరమైన కమెంట్స్, కంపేర్స్ చేయడం ఎందుకు అనేది అసలు ప్రశ్న.

Tags

Next Story