NTR : ఎన్టీఆర్ తో పోటీకి నాని పోటీ..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీస్ విషయంలో క్లారిటీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని చేసిన దేవరతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా రాబోతోందీ మూవీ అని కూడా చెబుతున్నారు. నిజానికి ఈ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే విడుదల చేయాలనుకున్నారు మొదట్లో. బట్ కాస్త ముందుగానే తేరుకున్నారు. అందుకే 2026 జూన్ 25న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అంటే రిలీజ్ టైమ్ కు చాలా టైమ్ ఉంది కాబట్టి హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు అనుకున్నారు. అయితే అదే టైమ్ కు నాని కూడా ఎన్టీఆర్ తో పోటీపడబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ విడుదల చేయబోతున్న జూన్ 25నే నాని ద ప్యారడైజ్ మూవీ రిలీజ్ చేయబోతున్నారు అని బలంగా వినిపిస్తోంది. నిజానికి ద ప్యారడైజ్ మూవీని మార్చి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆ టైమ్ కు పూర్తి కావడం సాధ్యం కాదు అని తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్ పూర్తయినా.. ప్రమోషన్స్ కు పెద్దగా టైమ్ సరిపోదు అని భావిస్తున్నారు. ఆ కారణంగానే ఈ మూవీని విడుదల వాయిదా వేయాలనుకుంటున్నారు. అయితే ఈ సమ్మర్ లో విడుదల కాబోతోన్న మూవీస్ అన్నీ రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాయి. రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోవడం కారణంగా కొత్త కొత్త డేట్స్ లో వాయిదాలు వేస్తున్నారు. అలా నాని ద ప్యారడైజ్ మూవీ కూడా పోస్ట్ పోన్ చేయబోతున్నారు.
ద ప్యారడైజ్ ను జూన్ 25న విడుదల చేయాలని భావిస్తుండటం కొత్త డౌట్స్ వస్తున్నాయి. అంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా వాయిదా పడబోతోందా అనే డౌట్స్ వస్తున్నాయి. లేదంటే నాని.. ఎన్టీఆర్ తో పోటీ పడటం సాధ్యం కాదు. ఎన్టీఆర్ రేంజ్ ను బట్టి నాని ఖచ్చితంగా తప్పుకుంటాడు. అయినా అదే డేట్ కు రావాలనుకుంటే మాత్రం నానికి చాలా డేర్ ఉన్నట్టుగానే భావించాలి. తమ మూవీ కంటెంట్ పై బలమైన నమ్మకం కూడా ఉండాలి. మొత్తంగా ఎన్టీఆర్ డేట్ కే వస్తే మాత్రం ఖచ్చితంగా అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
