Nani's Hit3 : నాని సినిమా రిలీజ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్

Nanis Hit3 :  నాని సినిమా రిలీజ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్
X

నేచురల్ స్టార్ నాని ఈ సారి మాస్ ను గట్టిగా టార్గెట్ చేశాడు. ఇప్పటి వరకూ ఫ్యామిలీ స్టార్ అనిపించుకున్న నాని ఫస్ట్ టైమ్ తన సినిమాకు వీక్ మైండ్ ఉన్నవాళ్లు, చిన్న పిల్లలు రావొద్దని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ సినిమా హిట్ 3. ఇందులో సాలిడ్ వయొలెన్స్ ఉంటుందని చెబుతున్నాడు. ‘అబ్ కీ బార్ అర్జున్ సర్కార్’అంటూ సినిమాలోని తన పేరుతో ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లోనే నిర్మించాడు నాని. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అడివి శేష్, కార్తీ కేమియో రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ న్యూస్ రాకపోయినా వచ్చిన వార్తలను ఖండించలేదు టీమ్.

మే 1న విడుదల కాబోతోన్న హిట్ 3పై భారీ అంచనాలున్నాయి అనేది నిజం. రీసెంట్ గా నాని తను నిర్మించిన కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న జోష్ లో ఉన్నాడు. ఆ జోష్ ను ఈ మూవీ డబుల్ చేస్తుందని నమ్ముతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మళయాలంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేయబోతుండటం విశేషం. దుల్కర్ మళయాలంలో డిస్ట్రిబ్యూషన్ లోనూ ఉన్నాడు. అతనే ఈ మూవీని కేరళలో విడుదల చేయబోతున్నాడు. గతంలో దుల్కర్ నటించిన ఓకే బంగారం అనే చిత్రంలో అతనికి నాని డబ్బింగ్ చెప్పాడు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే ఇది బిజినెస్ కదా. అందుకే అన్నీ చూసుకునే దుల్కర్ ఈ రిలీజ్ చేస్తున్నాడని అనుకోవచ్చు.

Tags

Next Story