Nani's new title is 'Court' : నాని కొత్త సినిమా టైటిల్ 'కోర్ట్'

Nanis new title is Court :   నాని కొత్త సినిమా టైటిల్ కోర్ట్
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్ గానూ మెప్పిస్తున్నాడు. తన అభిరుచికి తగ్గ కథలతో ఆకట్టుకుంటున్నాడు. హను మాన్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడుగా పరిచయం చేసింది నానినే. హిట్, హిట్ 2 ఫ్రాంఛైజీలతో శేలేష్ కొలనును దర్శకుడుగా పరిచయం చేశాడు. ఇప్పుడు మరో డైరెక్టర్ ను ఇంటర్ డ్యూస్ చేస్తున్నాడు. ఈ సారి ఓ పెద్ద కాన్సెప్ట్ తోనే వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. 'కోర్ట్' అనే టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మామూలుగా న్యాయస్థానంలో కళ్లకు గతంలు కట్టిన న్యాయ దేవత కనిపిస్తుంది. కానీ ఈ కోర్ట్ మూవీ పోస్టర్ లో న్యాయ దేవత బోనులో నిలబడి ఉంది. అంటే కోర్ట్ రూమ్ డ్రామా అని వేరే చెప్పక్కర్లేదు కానీ.. మోషన్ పోస్టర్ తోనే న్యాయ దేవతను బోనులో నిలబెట్టారంటే పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను డిస్కస్ చేస్తున్నానపిస్తోంది. పైగా టైటిల్ తో పాటు ''స్టేట్ వర్సెస్ నో బడీ" అనే క్యాప్షన్ కూడా ఉంది.

ఇక ఈ సినిమాలో ప్రియదర్శి మెయిన్ లీడ్ చేస్తున్నాడు. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ జగదీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నాని భార్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా బేబీ ఫేమ్ విజయ్ బుల్గానని సంగీతం చేస్తున్నాడు. మొత్తంగా నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుంచి ఓ పవర్ ఫుల్ సినిమా రాబోతోందని మోషన్ పోస్టర్ తోనే హింట్ ఇచ్చారు.

Tags

Next Story