Nani : నాని నెక్ట్స్ మూవీ సుజిత్ తో కాదా

Nani :  నాని నెక్ట్స్ మూవీ సుజిత్ తో కాదా
X

నేచురల్ స్టార్ నాని దూకుడు గురించి అందరికీ తెలుసు. ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉండగానే మరో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఒకేసారి నాలుగైదు మూవీస్ కు సైన్ చేస్తాడు. ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ద పారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ రెండూ ఇప్పుడు సెట్స్ లో ఉన్నాయి. ఇవి కాక.. సుజిత్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ కాంబినేషన్ లో సినిమా ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ ప్లేస్ లో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. అది కూడా మళయాలీ దర్శకుడు.

మళయాలంలో జయ జయ జయ జయ హే, గురవాయూర్ అంబలనాదయిల్ అనే మూవీస్ తో మంచి విజయాలు సాధించిన దర్శకుడు విపిన్ దాస్. ఈ రెండూ కుటుంబ కథా చిత్రాలే. కానీ హిలేరియస్ కామెడీతో పాటు ఇంటర్నల్ గా చిన్న సెన్సిటివ్ టాపిక్స్ ను సెన్సిబుల్ గా చెబుతాడు విపిన్ దాస్. అలాంటి విపిన్ రీసెంట్ గా నానికి ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో నెక్ట్స్ అతనితోనే సినిమా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించిన అఫీషియల్ ప్రకటన త్వరలోనే వస్తుందట. హిట్ 2, ద పారడైజ్ మూవీస్ పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తారట. ఏదైనా ఇతర భాషా దర్శకులు తెలుగులో సక్సెస్ అయింది తక్కువే. మరి విపిన్, నాని కాంబో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags

Next Story