Nani : నానిని వదలని దర్శకుడు

Nani :  నానిని వదలని దర్శకుడు
X

ఆ తమిళ దర్శకుడికి నానితో పనిచేయాలని కోరిక. కొన్నాళ్ల క్రితం నానిని కలిశాడు. ఇంకా అతని సినిమా చూసి నాని కూడా ఆ దర్శకుడితో వర్క్ ఇంట్రెస్ట్ చూపించాడు.అయితే కథ విషయంలో సెట్ కాలేదు. నాని అతని స్టోరీని రిజెక్ట్ చేశాడు. దీంతో వేరే హీరోతో సినిమా చేసుకుంటాడు అనుకున్నారు.బట్ అతను కథ సెట్ చేసుకున్నాడు. మళ్లీ నానిని కలిసి ఒప్పించాడు. అది కూడా మైత్రీ మూవీస్ బ్యానర్ లో. యస్.. ఈ దర్శకుడి పేరు శిబి చక్రవర్తి. చేసింది ఒక్క సినిమానే కానీ.. విషయం ఉన్నవాడు అనిపించుకున్నాడు.

కొన్నాళ్ల క్రితం శివకార్తికేయన్ తో డాన్ అనే మూవీతో మెరిశాడు శిబి. అంతకు ముందు అట్లీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. డాన్ లో అతను అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించాడు. ఓ రకంగా అది తన కథేనేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ తో అందరి చేతా కన్నీళ్లు పెట్టించాడు.ఈ మూవీ తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయింది. ఇక్కడా ఆకట్టుకుంది.

ఆ దర్శకుడే మళ్లీ ఓ బలమైన కథతో నానిని ఒప్పించాడు అనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ వాళ్లు ఇన్ డైరెక్ట్ గా ప్రాజెక్ట్ కన్ఫార్మ్ చేశారు. పైగా ఈ మూవీ కోసం నాని.. సుజిత్ సినిమాను కూడా పక్కనపెట్టాడు అంటున్నారు. సో.. ఈ కాంబినేషన్ లో ఓ సినిమా అఫీషియల్ గా త్వరలోనే అనౌన్స్ కాబోతోంది.

Tags

Next Story