Nani : నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..

Nani :  నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న మూవీ ద ప్యారడైజ్ ముందు నుంచీ ఊహించినట్టుగానే జరిగింది. ఈ మూవీ రిలీజ్ డేట్ మారబోతోంది అని ముందు నుంచీ చెబుతున్నారు. మమూలుగా అయితే ఈ మూవీ మార్చి 27న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. బట్ ఆ డేట్ లో రావడం కష్టమే అని చాలామంది అన్నారు. అందుకు కారణాలు చాలానే చెప్పారు. బట్ ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టైమ్ కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది అని తెలియడంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసింది మూవీ టీమ్.

ద ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ గా ఆగస్ట్ 21న అని ప్రకటించింది మూవీ టీమ్. మామూలుగా అయితే ఇలాంటి మూవీస్ ఇండిపెండెన్స్ సందర్భంగా విడుదలవుతుంటాయి. బట్ అలా కాకుండా ఆగస్ట్ 21న అనడం కాస్త కొత్తగానే ఉంది. అంటే ఇండిపెండెన్స్ డే రోజు సందర్భంగా ఇంకేవైనా పెద్ద మూవీస్ కూడా వస్తున్నాయా అనే డౌట్ కూడా ఉంది. అలా కాదు అంటే ఖచ్చితంగా ఈ డేట్ మాత్రం సర్ ప్రైజింగ్ గానే ఉంది.

ఇక నానితో పాటు మోహన్ బాబు, రమ్యకృష్ణ, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోనాలి కులకర్ణి ఫస్ట్ ఫీమేల్ లీడ్ గా తీసుకున్నారు. తనతో పాటు కయాడు లోహర్ కూడా తోడైంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.





Tags

Next Story