Nani : నాని సరిపోదా శనివారం.. టీజర్ వచ్చేస్తోంది..

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 29న విడుదల కాబోతోంది. ఇంతకు ముందు నాని, వివేక్ కాంబోలో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కాన్సెప్ట్ బావున్నా.. ఎగ్జిక్యూషన్ లోపంతో ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. అయినా మరోసారి వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చాడు నాని. నిజానికి తెలుగులో ఈ తరం దర్శకుల్లో వివేక్ ఆత్రేయ టేకింగ్, స్టోరీ టెల్లింగ్ కొత్తగానే ఉంటుంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ తో వస్తుంటాడు. ఇప్పటి వరకూ సాఫ్ట్ కంటెంట్స్ తోనే మెప్పించిన వివేక్ ఆత్రేయ ఫస్ట్ టైమ్ మాస్ మూవీతో వస్తున్నాడు. నానిని ఇప్పటి వరకూ చూడని పాత్రలో చూపించబోతున్నాడని అర్థం అవుతోంది. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టీజర్ కు టైమ్ వచ్చింది.
కొన్నాళ్లుగా నాని మాస్ ఇమేజ్ కోసం తపిస్తున్నాడు. అందుకే శ్యామ్ సింగరాయ్, దసరా వంటి మూవీస్ కు ఓకే చెప్పాడు. ఇది కూడా మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న కథే అని అర్థం అవుతోంది. గతంలో టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మధ్యలో విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే నానికి మాస్ ఇమేజ్ తెచ్చే సినిమాలానే కనిపిస్తోంది. అయితే టైటిల్ తో పాటు ఈ కంటెంట్ కు భిన్నంగా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కనిపించింది. తమిళ్ స్టార్ ఎస్.జే. సూర్య విలన్ గా నటిస్తుండటంతో సరిపోదా శనివారం వెయిట్ పెరిగింది. అతని బర్త్ డే రోజు రిలీజ్ చేసిన టీజర్ కాని టీజర్ కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న సరిపోదా శనివారం మూవీ టీజర్ ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు టీజర్ సెన్సార్ కూడా పూర్తయింది. ఈ టీజర్ 84 సెకన్ల పాటు ఉండబోతోంది. సో.. టీజర్ చూస్తే సినిమాపై ఒక అవగాహనకు రావొచ్చు. ట్రైలర్ వచ్చాక అంచనాలు వస్తాయి. సో.. ఆగస్ట్ 29 ఎంతో దూరం లేదు. కాబట్టి టీజర్ తర్వాత వెంటనే ట్రైలర్ ప్లానింగ్ కూడా ఉండొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com