Daku Maharaaj : డాకూ మామ కోసం వస్తోన్న మంత్రిగారు

Daku Maharaaj :  డాకూ మామ కోసం వస్తోన్న మంత్రిగారు
X

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకూ మహరాజ్. ఈ నెల 12న విడుదల కాబోతోంది. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీ కాబోతోందని మేకర్స్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు. అది నిజం కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్నాళ్లుగా బాలయ్య వరుస విజయాలతో జోష్ గా ఉన్నాడు. ఆ జోష్ ను డబుల్ చేస్తుందీ మూవీ అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు ఈ మూవీతో పాటు అన్ స్టాపబుల్ షోతోనూ ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య.. కోసం అల్లుడు, ఏపి మినిస్టర్ నారా లోకేష్ వస్తున్నాడు.

ఈ గురువారం డాకూ మహరాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా లోకేష్ రాబోతున్నాడు. లోకేష్ గతంలో కూడా బాలయ్య మూవీ ఫంక్షన్స్ కు వచ్చాడు. అయితే మంత్రిగా ఇప్పుడు లోకేష్ కూడా 2.0 లాగా కనిపిస్తున్నాడు. మరి మామా అల్లుళ్లు ఈ వేదిక సాక్షిగా ఏం మాట్లాడబోతున్నారు.. సినిమాకు ఎలాంటి హైప్ తీసుకు రాబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపి ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ఉంది. ఎక్స్ ట్రా షోస్ కు కూడా అనుమతి ఇచ్చారు అక్కడ.

Tags

Next Story