సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్షన్లో నారా రోహిత్ కం బ్యాక్ మూవీ

సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్షన్లో నారా రోహిత్ కం బ్యాక్ మూవీ
పొలిటికల్ డ్రామాగా 'ప్రతినిధి 2'.. అదిరిపోయే పోస్టర్ తో షాక్ ఇచ్చిన నారా రోహిత్

చాలా రోజుల తర్వాత హీరో నారా రోహిత్ ఆసక్తి రేకెత్తించే అప్ డేట్ తో వచ్చాడు. ప్రతినిధి 2 పేరుతో రాబోతున్న ఆయన లేటెస్ట్ సినిమాకు సంబంధించిన తాజాగా రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కు ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రతినిధి మూవీకి సీక్వెల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్టోరీలో ప్రత్యేకత, గ్రిప్పింగ్ ఉండడంతో విమర్శల చేత సైతం ఈ మూవీ ప్రశంసలు అందుకుంది.

తాజాగా రివీలైన ప్రతినిధి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ఆద్యంతం.. ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇందులో నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నాడు. అతని జుట్టు నుంచి ముఖం వరకు వార్తాపత్రికలతో రూపొందించారు. ఈ క్రేజీ పోస్టర్ ను బట్టి చూస్తుంటే.. ఈ ప్రతినిధి 2లో సామాజిక సమస్యలను చూపించనున్నట్టు కూడా తెలుస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పలు సినిమాల్లో నటించిన ప్రముఖ జర్నలిస్టు మూర్తి.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఓటీటీ మూవీ ప్లే బ్యాక్ లో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన నారా రోహిత్ తో సినిమా చేస్తుండడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి బజ్ ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

‘బాణం’ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన నారా రోహిత్.. ఒకప్పుడు ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ‘సోలో’ లాంటి కమర్షియల్ సినిమా చేసి హీరోగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా కానీ, నటుడిగా గానీ ఆయనకు మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ నారా రోహిత్‌‌ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. చాలా గ్యాప్ తర్వాత తన 19వ మూవీపై ఓ కీలక అప్ డేట్ వదిలిన నారా రోహిత్.. ఈనెల 24వ తేదీన సాయంత్రం 4.03 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో 2 అనే నంబర్ మాత్రమే ఉంది. అలాగే, చేయి పైకెత్తి రెండు వేళ్లు ముడి, మూడు వేళ్లు పైకి చూపిస్తున్నట్టు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ చేతికి వార్తాపత్రికలలా కనిపిస్తున్న పేపర్లను చుట్టి ఉంచారు. ‘అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక మనిషి మరోసారి నిలబడబోతున్నాడు’ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది.

ఇక కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ప్రతినిధి 2 సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. పోస్టర్‌లో చూపిన విధంగా ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కథానాయిక, ఇతర నటీనటులను త్వరలో వెల్లడిస్తారని నిర్మాతలు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story