ఎమ్మెల్యేగా నారా వారబ్బాయ్ 'రోహిత్'..

ఎమ్మెల్యేగా నారా వారబ్బాయ్ రోహిత్..
దాదాపుగా మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్

బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తుందంటే ఆ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. బాలకృష్ణ BB3 హ్యాట్రిక్ మూవీలో నారా రోహిత్ నటిస్తున్నారని, అందులో ఆయన క్యారెక్టర్ ఎమ్మెల్యే అని తెలుస్తోంది. బాణం, సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో నారా రోహిత్‌కు ఈ మధ్య సినిమాలేవీ లేవు. దాంతో ఆయన BB3 సినిమాలో ఎమ్మెల్యే రోల్ చేస్తున్నారని సమాచారం.

దాదాపుగా మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్ బరువు కూడా పెరిగారు. దీంతో ఈ చిత్రంలోని పాత్రకోసమని బాడీ మీద శ్రద్ధ పెట్టి బరువు తగ్గారు. కొత్త లుక్‌లో ఉన్న ఆయన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ రోహిత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాలో ఎమ్మెల్యేగా నటించడం రోహిత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సమాచారం. బాలక‌ష్ణ 106వ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల్ రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Tags

Next Story