Nachindi Girl Friendu : దోస్త్ అంటే నువ్వేరా సాంగ్‌ను రిలీజ్ చేసిన నారా రోహిత్..

Nachindi Girl Friendu : దోస్త్ అంటే నువ్వేరా సాంగ్‌ను రిలీజ్ చేసిన నారా రోహిత్..
X
Nachindi Girl Friendu : ‘దోస్త్ అంటే నువ్వేరా.. సాంగ్‌’ ను నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు

Nachindi Girl Friendu : ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సంబంధించిన 'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా సాంగ్‌' ను నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. ఈ మూవీలో ఉదయ్‌శంకర్ హీరోగా, జెన్నీ హీరోయిన్‌గా నటిస్తోంది. గురుపవన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా ఈ సాంగ్‌ను పాడడంతో ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. పాట పాడుతుంటే చాలా ఎంజాయ్ చేశానన్నారు. దోస్త్‌లందరికీ ఇది ఒక ఆంథమ్ సాంగ్ అవుతుందన్నారు. అయితే త్వరలోనే 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ' మూవీ రిలీజ్ కాబోతోంది. ఎప్పుడనేది మేకర్స్ ప్రకటించలేదు.

Tags

Next Story