Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీలో నారా రోహిత్

Pawan Kalyan  :  పవన్ కళ్యాణ్ మూవీలో నారా రోహిత్
X

నారా రోహిత్ ఒకప్పుడు మంచి కథా బలం ఉన్న సినిమాలతో మెప్పించాడు. కాకపోతే మధ్యలో కెరీర్ ట్రాక్ తప్పింది. దీంతో గ్యాప్ తీసుకున్నాడు. ఓ దశలో తిరిగి రాడేమో అనుకున్నారు చాలామంది. ఆ మధ్య సుందరకాండ అనే సినిమా చేస్తున్నానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ మూవీ ఏమైందో కానీ ప్రస్తుతం భైరవంతో వస్తున్నాడు. ఈ నెల 30న విడుదల కాబోతోన్న భైరవంలో రోహిత్ వరద అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అతని క్యారెక్టర్ సినిమాలో ఓ హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ లతో కలిసి అతను హీరోగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అతని పాత్రకు సంబంధించి విడుదల చేసిన థీమ్ సాంగ్ అదిరిపోయిందనే టాక్ తెచ్చుకుంది.

భైరవం ప్రమోషన్స్ సందర్భంగా నారా రోహిత్ ఓ సర్ ప్రైజింగ్ విషయాన్ని పంచుకున్నాడు. అతను పవన్ కళ్యాణ్ ‘ఓ.జి’మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని ఈ ముగ్గురు హీరోలను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సాయిదుర్గా తేజ్ చెప్పే వరకూ ఎవరికీ తెలియదు. అదే విషయం మనోజ్ అడిగితే.. మీరు అడగలేదు నేను చెప్పలేదు అంటూ తప్పించుకున్నాడు. సాయి తేజ్ కూడా అందర్లానే.. రోహిత్ ను .. ‘ఓ.జి అప్డేట్స్ ఏమైనా చెప్పొచ్చు కదా’అని అడగటం విశేషం.

పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా చూస్తున్నారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటిస్తోన్న ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ కనిపించబోతోంది. ఇప్పుడు నారా రోహిత్ మరో కీలక పాత్రగా తేలిపోయింది. మరి రోహిత్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story