నరసింహనాయుడు వర్సెస్ ఖుషి.. బాక్సాఫీసు షేక్ చేసిన మూవీ ఏది?

Boxoffice Hit

Narasimha naidu And Kushi

Narasimha Naidu and Khushi: నందమూరి నటసింహాం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి నరసింహనాయుడు. అదే ఏడాది విడుదలైన మరో చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి.

Narasimha Naidu Vs Khushi: నందమూరి నటసింహాం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి నరసింహనాయుడు. ఈ సినిమా 2001లో విడుదలై అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే ఏడాది విడుదలైన మరో చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి. వరుసగా ఆరు హిట్స్ తో దూసుకుపోతున్నా పవన్ కళ్యాణ్.. ఖుషితో మరో పవర్ ఫుల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పవన్ సినీ కెరీర్ నే మలుపు తిప్పింది. 2001లోనే ఖుషి, న‌ర‌సింహానాయుడు చిత్రాలు తెలుగు ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను షేక్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీసు షేక్ చేసిన మూవీ ఏది అనే సందేహం ఫ్యాన్స్ లో ఇప్పటికి ఉంది.

ప‌వ‌న్ హీరోగా ఎస్.జె సూర్య దర్శకత్వంలో విడుద‌లైన మూవీ ఖుషి. ఈ మూవీ పవన్ సినిమాల్లోనే వన్ ఆఫ్ ది మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ఇక బి గోపాల్ దర్శకత్వంలో బాల‌య్య న‌టించిన మరో సినిమా నరసింహనాయుడు. ఈ సినిమా అయితే మాస్ ఆడియ‌న్స్ చేత కేకలు పెట్టించింది. రెండు సినిమాలకు బాణీలు కట్టింది మెలోడి బ్రహ్మ మణిశర్మనే. ఇక ఖుషి, నరసింహనాయుడు సినిమాల్లోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల మొబైల్స్ లో ఉంటాయి. సంగీత ప్రియులను అంతలా ఆకట్టుకుంది సంగీతం.

Pawan Kalyan - Bala Krishna

కలెక్షన్ల పరంగా చూస్తే.. అయితే పవన్ కళ్యాణ్ ఖుషి మొత్తంగా 21 కోట్లపైగా షేర్ క‌లెక్ట్ చేసింది. నైజాం, కృష్ణా ఏరియాలో న‌రసింహానాయుడి కంటే సిద్ధునే పైచేయి సాధించాడు. న‌ర‌సింహానాయుడు విషయానికి వస్తే.. ఈ సినిమా 22 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది. సీడెడ్, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్ ,వెస్ట్ క‌ర్ణాట‌క, ప్రాంతాల్లో ఖుషి కంటే కాస్త ఎక్కువ వసూలు చేసింది. సంక్రాంతికి విడుదలైన నరసింహానాయుడు మూడు నెలల గ్యాప్‎లో విడుదలైన ఖుషి.. ఈ ఇద్దరి హీరోల సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయి.

అప్పట్లో వసూళ్లు కంటే ఏ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనేది చూసేవారు. ఇండ‌స్ట్రీ హిట్ సినిమాను థియేట‌ర్ల లెక్కను బ‌ట్టి లెక్కించేవారు. న‌ర‌సింహానాయుడు 105 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. ఖుషి 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఖుషి 110 కేంద్రాల్లో 100 రోజులు ఆడించాలని నిర్మాత భావించినా.. ఫేక్ రికార్డ్స్ కోసం అలాంటి పనులు చేయొద్దని ప‌వ‌న్ హితవు పలికినట్లు టాక్. ఈ ఇద్దరి హీరోల సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. అప్పట్లో నందమూరి-మెగా హీరోలు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఓ పంక్షన్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story