Allari Naresh : సితార బ్యానర్ లో నరేష్ సినిమా స్టార్ట్

అల్లరి నరేష్ తనలోని కామెడీ యాంగిల్ ను వదిలేసి ఈ మధ్య సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో కామెడీ చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు. నెక్ట్స్ బచ్చలమల్లి అనే మాస్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటి వరకూ పెద్ద బ్యానర్స్ లో తక్కవ సినిమాలే చేసిన నరేష్ ఫస్ట్ టైమ్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో నటించబోతున్నాడు. ఈ మూవీ ఈ శనివారం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇంతకు ముందు ఫ్యామిలీ డ్రామా అనే మూవీతో ఆకట్టుకున్న మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకుడు. రుహానీ శర్మ హీరోయిన్ గా కాక ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోందని చెప్పారు. మరి తన పాత్ర ఏంటో ఎలా ఉంటుందో చూడాలి.
మొత్తంగా నరేష్ తన రూట్ మార్చాడు. వెండితెరపై కామెడీకి కాలం చెల్లిపోలేదు కానీ.. సరైన కామిట్ స్టోరీస్ పడటం లేదు అతనికి. లేదంటే నరేష్ టైమింగ్ కు ఆ కథలు పేలిపోతాయి. మరోవైపు ఈ తరహా కామెడీస్ అన్నీ ఇప్పుడు బుల్లితెరపైనే విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. అందుకే కొన్నిసార్లు మంచి కామెడీ కంటెంట్ వచ్చినా థియేటర్స్ లో పెద్దగా పట్టించుకోవడం లేదు ఆడియన్స్. ఈ కారణంగాన కావొచ్చు.. కామెడీ హీరోగానే కాక బలమైన నటుడుగానూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నాంది హిట్ అయింది. ఉగ్రమ్ పోయింది. అయినా కంటెంట్ బేస్డ్ స్టోరీస్ తోనే వచ్చే ప్రయత్నం చేస్తోన్న నరేష్ క సితార బ్యానర్ ఓ సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com