Nargis Fakhri: సినిమాలు చేస్తూ నా సంతోషానికి దూరమవుతున్నానేమో అనిపించింది: బాలీవుడ్ బ్యూటీ

Nargis Fakhri (tv5news.in)
Nargis Fakhri: బాలీవుడ్‌లో కాంట్రవర్సీలు సాధారణంగా ఎక్కువ. అందుకే నటీనటులు ఏం మాట్లాడిన దాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తుంటారు కొందరు నెటిజన్లు. అలాగే బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టినప్పుడు బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రికి కూడా నెగిటివిటీ ఎదురయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికే తను సినిమాలు చేయడం తగ్గించేసింది. ఇటీవల దానికి కారణం ఏంటో బయటపెట్టింది నర్గీస్.
నర్గీస్ ఫక్రి.. 'రాక్‌స్టార్'లాంటి సూపర్ హిట్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయ్యింది నర్గీస్. ఆ తర్వాత తనకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు నర్గీస్ బాలీవుడ్‌లో చాలా బిజీగా గడిపింది. అలా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది నర్గీస్. ఇన్నాళ్ల తర్వాత ఆ బ్రేక్‌కు కారణం ఏంటో చెప్పింది.
సినిమాల్లో బాగా బిజీగా ఉన్న సమయంలోనే తాను ఎక్కువగా పనిచేస్తున్నట్టు ఫీల్ అయ్యిందట నర్గీస్. దాని వల్లే మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యిందట. కుటుంబాన్ని, ఫ్రెండ్స్‌ను, ఫ్యామిలీని మిస్ అయినట్టు తెలిపింది నర్గీస్. వరుసపెట్టి సినిమాలు చేస్తూ నా సంతోషానికి దూరమవుతున్నానేమో అనిపించిందంది. అంతే కాకుండా శారీరిక, మానసిక ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం తప్పనిసరి అని చెప్పింది నర్గీస్ ఫక్రి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com