ఓటిటిల్లో ఆకట్టుకుంటోన్న ‘నరుడి బ్రతుకు నటన’

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ముఖ్య పాత్రల్లో నటించిన ‘నరుడి బ్రతుకు నటన’ అక్టోబర్ చివరి వారంలో విడుదలై థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, హ్యూమన్ ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి ఆదరణ దక్కింది.
టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధూ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌నీ మెప్పిస్తోంది. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో సినీ లవర్స్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.
నరుడి బ్రతుకు నటన ఎమోషనల్ రైడ్‌గా, హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఫహద్ అబ్దుల్ మజీద్ హ్యాండిల్ చేసిన సినిమాటోగ్రఫీ,ఆయన ఇచ్చిన థ్రిల్లింగ్ విజువల్స్ సినిమాను మరింత అందంగా మలిచాయి. NYX లోపెజ్ సంగీతం సినిమా మూడ్‌ని తెలియజేసేలా ఉంటుంది. ఓ మంచి చిత్రాన్ని చూశామనే ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఇచ్చేలా ‘నరుడి బ్రతుకు నటన’ ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com