సినిమా

Bigg Boss 5 Telugu: నాలుగో వారం నటరాజ్ ఎలిమినేషన్.. మరి ఆయన పారితోషికం ఎంత?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న ఫ్యాన్‌బేస్ వల్ల దానికి సంబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతూ వస్తుంది.

Bigg Boss 5 Telugu: నాలుగో వారం నటరాజ్ ఎలిమినేషన్.. మరి ఆయన పారితోషికం ఎంత?
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న ఫ్యాన్‌బేస్ వల్ల దానికి సంబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా హౌస్‌మేట్స్‌లో ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనేదానిపై ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. బిగ్ బాస్ షోలో చివరివరకు ప్రేక్షకుల సపోర్ట్‌తో నిలబడి విన్నర్ అయితే వారికి వచ్చే క్యాష్ ప్రైజ్ గురించి అందరికీ తెలుసు. కానీ అది కాకుండా రోజుకు ఒక్కొక్క హౌస్‌మేట్ ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు? ఇటీవల ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసి హౌస్‌లోకి వచ్చారు...

ఇప్పటివరకు బిగ్ బాస్ 5 తెలుగులో నాలుగు ఎలిమినేషన్లు జరిగాయి. అందులో ముందుగా మొదటి వారంలోనే హౌస్ నుండి తప్పుకుంది సరయు. ఆ తర్వాత వారం ఉమాదేవి ప్రేక్షకుల చేత ఓట్లు వేయించుకోలేక ఎలిమినేట్ అయ్యింది. మూడో వారంలో నామినేషన్ల సమయంలో వచ్చిన నెగిటివిటీ వల్ల లహరి ఇంటి బాటపట్టింది. ఇక నాలుగో వారం జరిగిన ఎలిమినేషన్‌లో నటరాజ్ మాస్టర్ బయటికి వచ్చేసారు. మరి నాలుగు వారాలు ఇంట్లో ఉన్నందుకు నటరాజ్ మాస్టర్‌కు ఎంత పారితోషికం అందింది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. నటరాజ్‌కు రోజుకు రూ. 15 వేలు ఇస్తామని బిగ్ బాస్ టీమ్ ఒప్పుకుందట. అంటే వారానికి దాదాపు రూ. లక్ష ఆయన ఖాతాలో పడినట్టే.. బిగ్ బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ నాలుగు వారాలు ఉన్నాడు కాబట్టి ఈ షో వల్ల ఆయన నాలుగు లక్షలు సంపాదించుకొని వెళ్తున్నాడన్నమాట. షోలో నటరాజ్ బాగానే ఎంటర్టైన్ చేసినందుకు ఈ పారితోషికాన్ని మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES