Nataraj Master: బాలయ్యతో నటరాజ్ మాస్టర్.. అందుకేనా..?

Nataraj Master (tv5news.in)
Nataraj Master: బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక్కసారి వెళ్తే తమ కెరీర్ టర్న్ అయిపోతుంది అని నమ్మేవారు ఉన్నారు. అయితే అందరికీ అది జరగకపోవచ్చు. కొందరికి లక్ కూడా కలిసి రావాల్సిందే. అది ఉండే బిగ్ బాస్‌కి విన్నర్ కాకపోయినా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 నుండి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్‌ది ఇదే పరిస్థితి. బిగ్ బాస్ నుండి ఇలా బయటకు రాగానే అలా.. ఒక బంపర్ ఆఫర్ కొట్టేశాడు నటరాజ్.
ఆహా కోసం బాలయ్య ఒక టాక్ షో చేయనున్నాడు. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' పేరుతో త్వరలోనే ఈ టాక్ షో ప్రచారం కానుంది. అయితే ఈ షోకు మరింత హైప్ క్రియేట్ అవ్వడం కోసం దీనికి ఒక ప్రమోషనల్ సాంగ్‌ను చిత్రీకరించాలి అనుకుంటున్నారట మేకర్స్. దానికోసం బాలయ్యకు డ్యాన్స్ కంపోజ్ చేయడానికి నటరాజ్ మాస్టర్‌ను రంగంలోకి దించిందట 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టీమ్.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం తన ఆటతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు నటరాజ్. ఇక హౌస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పూర్తిగా తన ఫ్యామిలీతోనే గడపడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్‌గా ఎన్నో రియాలిటీ షోలు, స్టేజ్ షోలు చేసిన నటరాజ్ మాస్టర్ కెరీర్ ఇటీవల కాస్త స్లో అయ్యింది. ఇన్నాళ్ల తర్వాత బాలకృష్ణ లాంటి టాప్ హీరోతో ఛాన్స్ రావడం తన కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాయి సినీ వర్గాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com