Nikhil Sidharth : కార్తికేయ 2 కి నేషనల్ అవార్డ్

Nikhil Sidharth :   కార్తికేయ 2 కి నేషనల్ అవార్డ్
X

70వ జాతీయ సినిమా అవార్డుల పురస్కారాల్లో తెలుగు నుంచి కార్తికేయ 2కు బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ వరించింది. తెలుగు నుంచి బెస్ట్ మూవీస్ విభాగంలో బలగం, మేజర్, సీతారామం సినిమాలతో పాటు కార్తికేయ 2 పోటీలో నిలిచింది. ఫైనల్ గా కార్తికేయ 2నే నేషనల్ అవార్డ్ వరించింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. 2014లో చందు డైరెక్ట్ చేసిన కార్తికేయకు ఇది సీక్వెల్.

ఈ సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్నంటూ లేదు అనే మనస్తత్వం ఉన్న డాక్టర్ కుర్రాడైన హీరో రెండో భాగంలో తల్లికి సంబంధించిన ఒక మొక్కు తీర్చుకోవడం కోసం కాశీకి వెళ్లడం.. అక్కడి నుంచి అనేక సంఘటనల తర్వాత అనూహ్యంగా హిమాలయాలకు వెళ్లి ఓ రహస్యాన్ని ఛేదించడం.. మరోవైపు అతన్ని తరముతూ కొందరు ప్రయత్నించం అనే కాన్సెప్ట్ కు తోడు మహా భారతంతో పాటు ద్వాపరయుగంలోని శ్రీ కృష్ణ తత్వాన్ని వివరిస్తూ.. అది ఈ లోకానికి ఎలా మేలు చేసింది అనే అంశాలను స్పృసిస్తూ సాగే కార్తికేయ 2 అంచనాలు లేకుండా విడుదలైంది. ఆ టైమ్ లో సినిమా రిలీజ్ కు సంబంధించి అనేక సమస్యలు కూడా వచ్చాయి. తమను తొక్కేస్తున్నారని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్ గా నేషనల్ అవార్డుల్లో మాత్రం ఎవరి చేతా తొక్కబడకుండా ‘‘ఆ శ్రీకృష్ణుడి వల్లే’’ ఈ మూవీ నేషనల్ అవార్డ్ గెలుచుకుంది.

Tags

Next Story