Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ప్రమాదం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అది చిన్న ప్రమాదమేనని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాను ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. "నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలా రోజులు అయిపోయింది. పబ్లిక్లో కూడా కనిపించి చాలా రోజులైంది. ఓ చిన్న ప్రమాదం జరగడం వల్లే నేను కనిపించలేదు. అందుకే ఆగస్ట్లో చురుగ్గా ఉండలేకపోయాను. ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉన్నాను. మీరెప్పుడు జాగ్రత్తగా ఉండటానికే అధిక ప్రాధాన్యం ఇవ్వండి. జీవితం చాలా చిన్నది. రేపు ఏం జరుగుతుందో అస్సలు ఎవరికీ తెలీదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అంటూ ఆమె తన ఫ్యానుకు సలహా ఇచ్చార ఎక్కడ జరిగిందనేది వెల్లడించలేదు రష్మిక. దీంతో ఇప్పుడు రష్మిక పెట్టిన పోస్ట్ పై పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com