Rashmika Mandanna : గ్రీన్ శారీలో నేషనల్ క్రష్

Rashmika Mandanna : గ్రీన్ శారీలో నేషనల్ క్రష్
X

పాన్ ఇండియా సినిమా పుష్పతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మారిపోయింది. ఇటీవల యానిమల్ సినిమాతో మారోమారు దేశవ్యాప్తంగా అభిమానులను అలరించింది ఈ కన్నడ కస్తూరి. ఇప్పటికే గీతగోవిందం సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ఇటీవల కేరళలో ఓ ఈవెంట్ కు హాజరై అక్కడి మాలీవుడ్ అభిమానులను అట్రాక్ట్ చేసింది. ఆ ప్రొగ్రాంలో గ్రీన్ శారీలో మెరిసి కేరళ అందాలను బీట్ చేసింది. ఆ చీరకట్టులో రంజితమే పాటకు స్టేజ్ పై ఈ బ్యూటీ డ్యాన్స్ చేస్తుంటే కేరళీయులు తమను తామే మైమరిచిపోయారట. ఈ మంగళూరు బ్యూటీ మలయాళంలో ఒక్క సినిమా చేయకపోయినా ఈ నేషనల్ క్రష్ డ్యాన్స్ చూడడానికి మలయాళ ఫ్యాన్స్ కు రెండు కండ్లు చాలలేదట. ఈ యానిమల్ బ్యూటీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Next Story