Natural Star Nani : ఇంటర్నేషనల్ లెవల్ కు డైరెక్ట్ గా వెళుతున్న నాని

Natural Star Nani  :  ఇంటర్నేషనల్ లెవల్ కు డైరెక్ట్ గా వెళుతున్న నాని
X

నేచులర్ స్టార్ నాని వరస ప్రాజెక్ట్స్ తో ఎప్పట్లానే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనే మెప్పించిన నాని ఇప్పుడు రూట్ మార్చాడు. మాస్ గేర్ లో దూసుకుపోతున్నాడు. మాస్ మూవీస్ తో మాత్రమే వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన హిట్ 3 టీజర్ తో అర్జున్ సర్కార్ గా ఓ మాస్ వార్నింగ్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ మూవీతో అతను బ్లడ్ షెడ్ చూపించబోతున్నాడు అంటున్నారు. దీంతో పాటు ఇప్పుడు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు.

హైదరాబాద్ లోని ప్యారడైజ్ అనే పదానికి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దసరాతోనే నానిని ఊరమాస్ అవతార్ లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేశాడు శ్రీకాంత్. ఇప్పుడు ప్యారడైజ్ తో వస్తోన్న ఈ కాంబోపైనా అంచనాలున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి ఓ కీలక పాత్ర చేస్తోంది.

ఇక కొన్నాళ్లుగా ప్యాన్ ఇండియా ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నాడు నాని. ద ప్యారడైజ్ తో ఏకంగా వాల్డ్ ఆడియన్స్ ముందుకే డైరెక్ట్ గా వెళ్లబోతున్నాడు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మార్చి 3న విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ను 8 భాషల్లో రిలీజ్ చేస్తారట. అయితే ఆశ్చర్యంగా ఇండియాతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. అంటే డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు పరిచయం అవుతాడన్నమాట. ఆల్రెడీ అతనికి ఓవర్శీస్ లో తిరుగులేని మార్కెట్ ఉంది. కాకపోతే అవన్నీ తెలుగు సినిమాలే. ఇప్పుడు వారి భాషలోనే వారికి పరిచయం కాబోతున్నాడు. మరి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags

Next Story