Mahesh Babu : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నాని..!

Mahesh Babu : ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.. రాధకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇందులో మహేష్ సరసన పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతొంది.
ఈ మూవీని దర్శకుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. . సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో చిన్న పాత్రలకు కూడా పెద్ద ఆర్టిస్టులను తీసుకుంటాడు. త్రివిక్రమ్ సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడానికి హీరోలు కూడా ఇష్టపడుతుంటారు.. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కీ రోల్ కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఓ వైపు త్రివిక్రమ్, మరో వైపు మహేష్ బాబు కావడంతో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక దీనిపైన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో మలయాళం నటులు కూడా నటిస్తున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది.. మహేష్ కి ఇది 28 చిత్రం కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com