Nava Deep : దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా..!

Nava Deep : తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు నవదీప్. లవర్‌బాయ్ రోల్స్‌లో పలు చిత్రాలలో నటించి మెప్పించాడు నవదీప్. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న నవదీప్.. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇదిలాఉండగా నవదీప్ పెళ్లి కోసం పలువురు నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి త్వరగా పెళ్లి చేసుకో అంటూ సలహలు ఇస్తున్నారు.
అయితే దీనిపైన నవదీప్ స్పందించాడు. ఈ సందర్భంగా పెళ్లి చేసుకోమంటూ ఉచిత సలహాలు ఇస్తున్న వారికి కౌంటర్ ఇచ్చాడు నవదీప్... ''వద్దురా సోదరా'' అంటూ ఓ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. నీ గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Oddhu ra sodhara :) pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com