Naveen Polishetty: జాతిరత్నం.. రూ.4 కోట్లు తిరిగి ఇచ్చేశాడు..

Naveen Polishetty: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో నవీన్ పోలిశెట్టిని చూసి ప్రేక్షకులు ముచ్చట పడ్డారు. ఎంత ఈజీగా యాక్ట్ చేసాడు అనుకున్నారు. జాతిరత్నాల్లో చూసి నిజంగా ఇండస్ట్రీకి దొరికిన జాతిరత్నం అనుకున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో వరుస అవకాశాలు క్యూ కట్టేశాయి. అనుష్కతో ఓ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్ (రూ.4 కోట్ల పారితోషికం), యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమాకు ఓకే చేసి అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని తెలిసింది.
అయితే ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్‌ను వదులుకున్నాడట. తీసుకున్న రూ.4కోట్ల పారితోషికం తిరిగి ఇచ్చేశాడని సమాచారం. రంగ్‌దే మూవీ కో డైరెక్టర్ కథ వినిపించగా నవీన్ స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించాడట. అయితే మార్పులు చేసినప్పటికీ కథ పూర్తికాకపోవడంతో తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే ఆ బ్యానర్ వాళ్లు ఈ విషయాన్ని నిర్ధారించవలసి ఉంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com