Naveen Polishetty : మణిరత్నం డైరెక్షన్ లో నవీన్ పోలిశెట్టి .. ?

ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకుని జాతిరత్నంలా దూసుకుపోతున్నాడు మిస్టర్ నవీన్ పోలిశెట్టి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా పడుతున్నాయి. ఆ మధ్య నిజంగానే ఓ ప్రమాదంలో కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుని చాలాకాలం రెస్ట్ తీసుకున్నాడు. దీంతో సినిమాలకు బాగా గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. మారి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లోనే గోదావరి జిల్లాల్లో ఉన్నాడు నవీన్. ఈ టైమ్ లో అతను మణిరత్నం డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్త హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో. ఇది వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయా లేదా అనేకంటే అయితే మాత్రం నవీన్ కెరీర్ లో మరో బెస్ట్ ఫేజ్ అవుతుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ అనే మూవీ రూపొందిస్తున్నాడు మణిరత్నం. వీరి కాంబినేషన్ లో 35యేళ్ల తర్వాత వస్తోన్న సినిమా ఇది. త్రిష, శింబు, అభిరామి, జోజూ జార్జ్, పంకజ్ త్రిపాఠి వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సమ్మర్ లో జూన్ 5న రిలీజ్ కాబోతోంది థగ్ లైఫ్. ఈ మూవీ తర్వాతే నవీన్ పోలిశెట్టితో ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ రూపొందించేందుకు ప్లానింగ్ చేస్తున్నాడు మణిరత్నం అనే రూమర్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా అనే కన్ఫర్మేషన్ నవీన్ టీమ్ నుంచే రావాలి. బట్.. నవీన్ లాంటి యాక్టర్ తో మణిరత్నం సినిమా అంటే చూసేవారికీ ఐ ఫీస్ట్ లా ఉంటుందేమో కదా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com