24 Jan 2023 9:13 AM GMT

Home
 / 
సినిమా / Nawazuddin Siddiqe:...

Nawazuddin Siddiqe: అత్తాకోడళ్ల పోరు...

పోలీసుల వరకూ వెళ్లిన అత్తా కోడళ్ల పోరు; మరో మలుపు తిరిగిన నవాజుద్దీన్ సిద్ధిఖీ విడాకుల కేసు..

Nawazuddin Siddiqe: అత్తాకోడళ్ల పోరు...
X

అత్తా కోడళ్ల కొట్లాట పోలీస్ కేసు వరకు వెళ్లింది. చాలా కాలంగా బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ( జైనాబ్ ) ఆలియాకు, అతని తల్లి మెహ్రున్నిసా సిద్ధిఖీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా.. ఆలియాపై మెహ్రున్నిసా సిద్ధిఖీ కేసు వేసింది. జనవరి 23న ఎఫ్ఐఆర్ దాఖలు కాగా, ఆలియా స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'షాకింగ్' అని కామెంట్ చేసింది.

మెహ్రున్నిసా సిద్ధిఖీ ఫిర్యాదు మేరకు ఆలియాపై ఐపీసీ 452, 323,504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వెర్సోవా పోలీసులు. అనంతరం ఆలియాను విచారించారు. ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ విషయంపై కామెంట్స్ చేసింది. "షాకింగ్... నా భర్తపై ఉన్న క్రిమినల్ కేసులను పోలీసులు పట్టించుకోలేదు. అయినా నా భర్త ఇంట్లోకి నేను వెళ్లిన వెంటనే పోలీసులు నాపై కేసు పెట్టారు. పరిస్థితులు ఈ విధంగా ఉంటే నాకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా" అని ఎఫ్ఐఆర్ ఫోటోను జతచేసి పోస్ట్ చేశారు ఆలియా.

నవాజుద్దీన్ సిద్ధిఖీకి జైనాబ్ అలియాస్ ఆలియాకు 2010లో పెళ్లి జరిగింది. నవాజుద్దీన్ కు ఆలియా రెండో భార్య. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10సంవత్సరాలు వీరి దాంపత్యం సరిగ్గా సాగింది. 2020లో ఆలియా విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. తన భర్త పిల్లల పట్ల సమయం కేటాయించడం లేదని పేర్కొంది. భర్తకు దూరంగా పిల్లలతో కలిసి వేరే ఇంట్లో ఉంటుంది. కొంతకాలానికి విడాకులు తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భర్త పిల్లలతో సమయం గడుపుతున్నాడని తెలిపింది. ఆస్తి తగాదాలు ఉండటం వలన కావాలనే తనపై మెహ్రున్నిసా కేసు వేసినట్లు తెలిపింది.

Next Story