Nayakudu: ఫదాహ్ పాజిల్ 'నాయకుడు' రిలీజ్ ఎప్పుడంటే..!

Nayakudu: ఫదాహ్ పాజిల్ నాయకుడు రిలీజ్ ఎప్పుడంటే..!

ఉదయనిధి స్టాలిన్, ఫదహ్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా తెలుగులో రిలీజ్ కు రెడీ అయింది. మామన్నన్ సినిమా తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ కు రెఢీగా ఉంది. ఇందుకుగానే టైటిల్ ను గురువారం చిత్రయునిట్ ప్రకటించింది. ఇందులో ఉదయనిధి, ఫాజిల్, కీర్తి సురేష్, సీనియర్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 14న తెలుగులో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఇందుకుగాను పోస్టర్ ను రిలీజ్ చేశారు. మామన్నన్ తెలుగు హక్కులను ఏసియన్ ఫిల్మ్స్, సురేష్ ప్రొడక్షన్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు.

రూలింగ్ పార్టీ లీడర్ తో తండ్రీ కొడుకులు సాగించిన పోరాటాన్ని సినిమాగా మలిచారు. రాజకీయాల్లో సామాజిక కుల వివక్షపై చిత్రం ఉంటుంది. జూన్ 29న తమిళంలో విడుదలైన ఈ సినిమా వారం తిరక్కుండానే రూ.40కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.




Tags

Read MoreRead Less
Next Story