KA Movie : 'క'లో సత్యభామగా నయన్ సారిక

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున భారీ పీరియాడిక్ థ్రిల్లర్ 'క' సినిమాలో హీరోయిన్ నయన్ సారిక సత్యభామగా ఆకట్టుకోనుంది. ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. లంగావోణిలో ట్రెడిషనల్ మేకోవర్లో నయన్ సారిక సత్యభామగా అందంగా కనిపిస్తోంది.
'క' సినిమా కథలో నయన్ సారిక సత్యభామ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండనుంది. సామ్ సీఎస్ 'క' సినిమాకు ఛాట్ బస్టర్ మ్యూజిక్ చేశారు. 'క’ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ నిర్మిస్తున్నారు.
దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో 'క' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్జడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకు రాబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com