Nayanathara: నయనతార 75వ చిత్రం ఎప్పుడంటే..

Nayanathara: నయనతార 75వ చిత్రం ఎప్పుడంటే..
Nayanathara: సాధారణ ఉద్యోగుల మాదిరిగానే తారలు కూడా పెళ్లిళ్లు చేసుకున్నా వెంటనే తాము సైన్ చేసిన ప్రాజెక్టుల్లో నిమగ్నమవుతున్నారు..

Nayanathara: సాధారణ ఉద్యోగుల మాదిరిగానే తారలు కూడా పెళ్లిళ్లు చేసుకున్నా వెంటనే తాము సైన్ చేసిన ప్రాజెక్టుల్లో నిమగ్నమవుతున్నారు.. తాజాగా నయనతార, విఘ్నేష్ వివాహం చేసుకుని హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నయన్ పెళ్లైన తరువాత ఒప్పుకున్న సినిమాలనే పూర్తి చేస్తుందని అనుకున్నారంతా.. కొత్త సినిమాలు చేయదేమో అని ఫ్యాన్స్ కూడా నిరాశపడ్డారు.

కానీ ఈ లేడీ సూపర్ స్టార్ తన 75వ చిత్రాన్ని ప్రకటించేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తున్న తాజాగా చిత్రానికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మలయాళ, తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తున్న నయన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునే ఏకైక హీరోయిన్ నయన్.. ఏదైనా చిత్రంలో నటించడం వరకే ఆమె పని.. ఎంత పెద్ద హీరో అయినా ప్రమోషన్ చేయడానికి అస్సలు రాదు.. అయినా ఆమె కాల్షీట్స్ కోసం క్యూ కడుతుంటారు మేకర్స్.

పెళ్లి తరువాత ప్రకటించిన తన 75వ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. కాగా, నయనతార ప్రస్తుతం చిరంజీవి గాడ్‌ఫాదర్ చిత్రంలోనూ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్‌లోను కీలక పాత్రలు పోషించనుంది.

Tags

Next Story