Nayantara : నన్ను అలా పిలవొద్దు అని చెప్పా

లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతోన్న బ్యూటీ నయనతార. తన సినిమాల ప్రమోషన్స్ కు రాదు అనే కంప్లైంట్ తప్ప.. ఆమెపై ఎలాంటి ఇష్యూస్ కనిపించవు నిర్మాతలకు.కాకపోతే ఆ విషయాన్ని ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఈ మధ్య ధనుష్ తో గొడవ సందర్భంగా ఓపెన్ లెటర్ రాసి నేనెందుకు భయపడాలి అని ప్రశ్నించిన ధైర్యం నయన్ ది. అయినా కోర్ట్ నయన్ ను జనవరి 8లోగా సమాధానం చెప్పమని నోటీస్ లు పంపించింది. తాజగా నయన్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకుంది. అందులో తనను లేడీ సూపర్ స్టార్ అనడం గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది.
తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దు అని చెప్పిందట. కానీ దర్శక, నిర్మాతలు ఒత్తిడి చేయడంతో ఒప్పుకోవాల్సి వచ్చిందట. అలాగే తన సినిమాలు కొందరు హీరోల సినిమాల కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయడం ఆనందాన్ని ఇచ్చినా అది కేవలం తన ఒక్కదాని క్రెడిట్ మాత్రమే కాదు అంది. తను గతంలో పనిచేసిన స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా నన్ను అభిమానిస్తున్నారు. వారి వల్లే తన సినిమాలు బాగా ఆడుతున్నాయని సమాధానం చెప్పింది. అజిత్ తో తనది హిట్ పెయిర్ అనీ.. అలాగే రజినీకాంత్, విజయ్ వంటి టాప్ స్టార్స్ ఫ్యాన్స్ నన్నూ అభిమానించడం వల్లే తన ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ విజయం సాధిస్తున్నాయని నిజాయితీగా ఒప్పుకుని ప్రశంసలు అందుకుంటోంది.
పెళ్లి, ఇద్దరు పిల్లల తల్లి కూడా అయినా .. నయన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సౌత్ లో హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ తనే. ఓ మీడియం రేంజ్ హీరో స్థాయిలో తనకు కోలీవుడ్ లో స్ట్రాంగ్ మార్కెట్ ఉండటమే అందుకు కారణం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com