Vignesh Shivan And Nayantara :నయనతార – విఘ్నేష్ శివన్‌ని అరెస్ట్ చేయండి: వ్యక్తి ఫిర్యాదు

Vignesh Shivan And Nayantara : రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను నిషేధించాలని, దాని వ్యవస్థాపక దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతారలను అరెస్ట్ చేయాలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది.
చెన్నైలోని సాలిగ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కణ్ణన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంచలన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో "రౌడీలను అణిచివేసేందుకు తమిళనాడు పోలీసులు పలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రౌడీలను ప్రోత్సహించేలా ఉంది నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల తీరు అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇదిలాఉంటే మరో కారణం కూడా వినిపిస్తోంది.. నటుడు అజిత్ 62వ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సంతోష సమయంలో విఘ్నేష్ శివన్ అతని రౌడీ పిక్చర్స్ టీమ్ కలిసి భారీ స్థాయిలో పటాకులు పేల్చినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న రౌడీ పిక్చర్స్ సంస్థ తీరుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, తక్షణమే నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై నిషేధం విధించి నటి నయనతార, విఘ్నేష్ శివన్‌లపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com