Nayantara : నయనతారకు భారీగా సమర్పించుకున్నారంటగా

Nayantara :  నయనతారకు భారీగా సమర్పించుకున్నారంటగా
X

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలకు హీరోయిన్ల సమస్య విపరీతంగా ఉంది. అలాంటిది ఇక ఏజ్ బార్ హీరోల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. దొరికిన హీరోయిన్లు భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇక ఆ హీరోయిన్లు స్టార్స్ అయితే నిర్మాతకు బడ్జెట్ మరింత పెరుగుతుంది. అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న సినిమాకు హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారు. నయనతార ఆల్రెడీ చిరంజీవితో గతంలో సైరా మూవీలో పెయిర్ గా, గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించింది. ఈ సారి మళ్లీ రెగ్యులర్ హీరోయిన్ పాత్ర. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అని అనిల్ ఆల్రెడీ హామీ ఇచ్చాడు. కాబట్టి ఈ మెగా ప్రాజెక్ట్ రిజల్ట్ గురించి ఎవరికీ డౌట్ లేదు కానీ.. నయనతార డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం హమ్మో అని అనుకోకుండా ఉండలేరు.

ప్రస్తుతం నయన్ కు సౌత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనే సత్తా చాటుతోంది. ఓ మీడియం రేంజ్ హీరోకు ఉన్నంత మార్కెట్ తన లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉంది. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ మామూలుగా తన రేంజ్ వేరే. అందుకే మెగాస్టార్ సినిమాకు ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందట. చూస్తే మెగాస్టార్ రేంజ్ ను మ్యాచ్ చేయాలంటే.. ఆ రేంజ్ ఉన్న హీరోయిన్స్ లేరు. ఉన్న ఇలాంటి వారు భారీ డిమాండ్స్ చేస్తున్నప్పుడు నిర్మాతలు తలొంచక తప్పదు కదా.. అందుకే నయన్ చెప్పిన దానికి ఒకటీ రెండు కోట్లు కాస్త అటూ ఇటూగా ఓకే చేశారు అని టాక్. ఏదేమైనా గ్లామర్ ఉండగానే బ్యాంక్ బ్యాలన్స్ చక్కబెట్టుకోవాలి అనేది ఈ తరం హీరోయిన్లకు ఎవరో చెప్పక్కర్లేదు. అదే నయన్ చేసింది. సాధించింది.

విశేషం ఏంటంటే.. ఈ జెనరేషన్ లో ఈ రేంజ్ లో భారీ రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉంది దీపికా పదుకోణ్. తర్వాతి స్థానం నయనతారదే.

Tags

Next Story