విఘ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్‌ పై ఓపెన్ అయిన నయన్..!

విఘ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్‌ పై ఓపెన్ అయిన నయన్..!
సినిమాలతో పాటుగా ఎఫైర్స్, బ్రేకప్స్ విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది లేడీ సూపర్ స్టార్ నయనతార..

సినిమాలతో పాటుగా ఎఫైర్స్, బ్రేకప్స్ విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రస్తుతం తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లతు ప్రేమలో మునిగితెలుతుంది ఈ అమ్మడు . ఎక్కడికి వెళ్ళిన వీరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి కూడా.. దీనితో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుబోతున్నరంటూ న్యూస్ చక్కర్లు కొట్టాయి. అయితే విఘ్నేష్‌ తో రిలేషన్ పైన ఎప్పుడు ఓపెన్ కానీ నయన్.. తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో ఓపెన్ అయింది. ఈ సందర్భంగా తనకు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని, దానికి సంబంధించి రింగ్‌ను చూపించి అందరికి షాకిచ్చింది. గతంలో విఘ్నేష్‌ శివన్ గుండెల మీద చేయి వేసి రింగ్‌ ఉన్న ఫోటోను హైలేట్‌ చేస్తూ నయన్‌ ఓ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అది ఎంగేజ్‌మెంట్‌ రింగే అయి ఉంటుందని పలువురు నెటిజన్లు భావించారు. తాజాగా నయన్ ఎంగేజ్‌మెంట్‌ పైన క్లారిటీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story