Nayanthara and Vignesh Shivan: సీఎంని పెళ్లికి ఆహ్వానించిన నయన్, విఘ్నేష్..

Nayanthara and Vignesh Shivan: జూన్ 9న నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లికి ఆహ్వానించేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశారు ఈ జంట. ఏడేళ్ల డేటింగ్ తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ ఈ వారం చెన్నైలో పెళ్లి చేసుకోనున్నారు.
నయనతార, ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ కాతు వాకుల రెండు కాదల్ చిత్రంలో కనిపించింది. వీరి వివాహం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో పెళ్లి జరగనుందని తెలుస్తోంది.
నయనతార గత సంవత్సరం ఓ టెలివిజన్ లైవ్ షోలో భాగస్వామి విఘ్నేష్ శివన్‌తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. నేత్రికణ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నయనతార తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడింది. స్టార్ విజయ్‌లో టాక్ షోలో పాల్గొన్నప్పుడు, నయనతార తన వేలికి ఉన్న ఉంగరం గురించి అడిగారు. అప్పుడు ఆమె విఘ్నేష్ శివన్‌తో జరిగిన తన నిశ్చితార్థం గురించి వివరించింది.
విఘ్నేష్ దర్శకత్వం వహించిన తన రెండవ చిత్రం నానుమ్ రౌడీదాన్‌లో నయనతారతో కలిసి పనిచేశాడు. ఆసమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. డేటింగ్ ప్రారంభించారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటించారు.
ఇదిలా ఉంటే విఘ్నేష్, నయనతార ఇటీవల నిర్మాతలుగా మారారు. వారి చిత్రం కూజాంగల్ అకా పెబుల్స్ ఇటీవల షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఇందులో కొత్తవారు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, పిఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వం వహించారు.
విఘ్నేష్ శివన్ తాజాగా దర్శకత్వం వహించిన కాతు వాకుల రెండు కాదల్ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు నటించారు. ప్రస్తుతం నయనతార నటించిన తమిళ థ్రిల్లర్ O2 విడుదల కావలసి ఉంది. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రదర్శించబడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com