Nayanthara : నయన్ ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీ.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో..

Nayanthara : నయన్ ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీ.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో..
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార 'బియాండ్ ది ఫెయిరీ టేల్' టీజర్ శనివారం విడుదలైంది. ఇందులో నయన్, విఘ్నేష్ శివన్‌లు ఎలా కలుసుకున్నారు.

Nayanatara: లేడీ సూపర్ స్టార్ నయనతార 'బియాండ్ ది ఫెయిరీ టేల్' టీజర్ శనివారం విడుదలైంది. ఇందులో నయన్, విఘ్నేష్ శివన్‌లు ఎలా కలుసుకున్నారు.. వివాహానికి దారి తీసిన అంశాలు అన్నీ వివరిస్తూ గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి సంబంధించిన ఒక నిమిషం టీజర్ ఈ రోజు విడుదలైంది. ఇందులో నటి గ్రాండ్ వెడ్డింగ్‌తో పాటు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు, తెరవెనుక ఎలా ఉంటారు అనే విషయాలన్నీ ఉంటాయి.

ఈ ఏడాది జూన్‌ 9న నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు ప్రముఖ నటులు రజనీకాంత్, షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, AR రెహమాన్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ వారి జీవితాలు, వివాహం మరియు అంతకు మించి చాలా ప్రైవేట్‌గా ఉండే నయనతార.. విఘ్నేష్‌ని ఎలా కలిసింది. తమ కోసం జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో వివరించారు.

OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన వార్షిక TUDUM ఈవెంట్‌ను సెప్టెంబర్ 24న నిర్వహించింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం వర్చువల్ ఈవెంట్ సందర్భంగా, నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అధికారికంగా ప్రకటించింది.

దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా, ది రౌడీ పిక్చర్స్ నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ మేకర్స్ బియాండ్ ది ఫెయిరీ టేల్ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసారు. "ఇది ఒక అద్భుత పెళ్లి కథ. ఈ ఫెయిరీటేల్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఈ ఇద్దరు ఆత్మలు ఒకరినొకరు ఎలా కనుగొన్నారు, వారు ఒకరినొకరు ఎలా ప్రేమించుకున్నారు.

పెళ్లికి ఎలా సిద్ధమయ్యారు అనే దాని గురించి ప్రేక్షకులకు వివరిస్తుంది. వారి జీవితంలో తదుపరి దశ ఎలా ఉండబోతుంది. ఇది వివాహ కథ కంటే చాలా ఎక్కువ - ఇది ఇద్దరు అందమైన వ్యక్తులు కలిసి జీవితాన్ని నిర్మించుకునే ప్రత్యేక కథ అని వారు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story